దిల్ రాజు సెంటిమెంట్ ఫలిస్తుందా..?

దిల్ రాజు సెంటిమెంట్ ఫలిస్తుందా..?
హిట్ చిత్రాల నిర్మాత ఎవరు అంటే దిల్ రాజు అని చెప్తారు.  దిల్ రాజు సినిమా తీస్తున్నాడు అంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది.  రాజు ఎంచుకునే కథలు కూడా అలాగే ఉంటాయి.  కథ నుంచి స్క్రిప్ట్ వర్క్ వరకు పక్కాగా ఉంటేనే సినిమా ప్లాన్ చేస్తాడు దిల్ రాజు.  ఇక దిల్ రాజుకు గతేడాది సూపర్ హిట్ ఇచ్చిన సినిమా ఫిదా.  తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఫిదా తరువాత దిల్ రాజు నిర్మాణంలో రాజాధి గ్రేట్, నేను లోకల్ సినిమాలు వచ్చాయి.  ఈ రెండు ఆశించినంత విజయాన్ని సొంతం చేసుకోలేకపోయినా పర్వాలేదనిపించాయి.   
ఫిదా స్థాయిలో హిట్ కోసం దిల్ రాజు తహతహలాడుతున్నాడు.  శర్వానంద్ శతమానం భవతి సినిమా దర్శకుడు వేగేశ్న సతీష్ తో శ్రీనివాస కళ్యాణం సినిమాను రూపొందిస్తున్నాడు దిల్ రాజు.  నితిన్ హీరోగా వస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నది.  దిల్ రాజుకు సెంటిమెంట్ గా కలిసొచ్చిన జూన్ 21 వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.  జూన్ రెండో వారాంతానికి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయాలని దిల్ రాజు టీం కృషి చేస్తోంది.  మరి దిల్ రాజు ఫిదా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా.. చూద్దాం.