హరీష్ శంకర్ ఈసారైనా కొడతాడా..?

హరీష్ శంకర్ ఈసారైనా కొడతాడా..?

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాకు ఒక చరిత్ర ఉంది.  గబ్బర్ సింగ్ రిలీజ్ తరువాత అప్పటి వరకు ఉన్న రికార్డులను ఆ సినిమా బ్రేక్ చేసింది.  హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకుడు. పవన్ కళ్యాణ్ మ్యానరిజంతో పాటు తగినంతగా ఎంటర్టైన్మెంట్ ను మిక్స్ చేసి.. తీసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.  దీని తరువాత హరీష్ శంకర్ కొన్ని పెద్ద సినిమాలు చేసినా కలిసిరాలేదు.  ఆ తరువాత, హరీష్.. అల్లు అర్జున్ తో డిజే చేశాడు.  డిజే సినిమా బాగున్నా.. ఎందుకో యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.  

ఈ సినిమా తరువాత హరీష్ శంకర్.. వరుణ్ తేజ్ తో వాల్మీకి సినిమా చేస్తున్నాడు.  ఇందులో వరుణ్ తేజ్ ను నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు.  జిగర్తాండ సినిమాకు ఇది రీమేక్.  తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథను మార్చి తెరకెక్కిస్తున్నాడట.  గబ్బర్ సింగ్ సినిమా కూడా నెగెటివ్ షేడ్స్ లోనే ఉంటుంది.  ఆ సినిమా సూపర్ హిట్టైంది.  ఇప్పుడు వాల్మీకి కూడా కొద్దిగా నెగెటివ్ షేడ్స్ ఉన్న సినిమానే.  మరి ఈ సినిమాతోనైనా హరీష్ హిట్ కొట్టి గాడిలో పడతాడా... చూద్దాం.