తెలుగ‌మ్మాయ్ ప్ర‌యోగం ఫ‌లిస్తుందా?

తెలుగ‌మ్మాయ్ ప్ర‌యోగం ఫ‌లిస్తుందా?

చిన్న సినిమాల్లో న‌టించి .. అటుపై చ‌క్క‌ని న‌టి అని పేరు తెచ్చుకుని అగ్ర హీరోల స‌ర‌స‌న అవ‌కాశం అందుకోవ‌డం అనేది అరుదు. అయితే తెలుగ‌మ్మాయిల్లో అలాంటి రేర్ ఫీట్‌తో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది `పెళ్లి చూపులు` ఫేం రీతు వ‌ర్మ‌. ఈ హైద‌రాబాదీ గాళ్ ప్ర‌స్తుతం చియాన్ విక్ర‌మ్ స‌ర‌స‌న `ధ్రువ‌న‌క్ష‌త్రం` చిత్రంలో న‌టిస్తోంది. గౌత‌మ్‌మీన‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 

ఈ సినిమా చిత్రీక‌ర‌ణ స‌హా నిర్మాణానంత‌ర ప‌నులు శ‌ర‌వేగంగా పూర్త‌వుతున్నాయి. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే తొలి సింగిల్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇప్ప‌టికే ఫ‌స్ట్‌లుక్ ఆక‌ట్టుకుంది. చియాన్‌తో రీతూ రొమాంటిక్ లుక్ రిలీజై యువ‌త‌రం మ‌న‌సు దోచింది. ఈ సినిమా రిలీజైతే రీతూ స్థాయి అమాంతం మారిపోతుంద‌ని అంచ‌నా వేస్తున్నారంతా. అయితే ఇదివ‌ర‌కూ చియాన్ విక్ర‌మ్ స‌ర‌స‌న `అప‌రిచితుడు` చిత్రంలో న‌టించిన స‌దా కెరీర్ ఎందుక‌నో ఆ త‌ర్వాత అంత స్పీడ్ పెర‌గ‌లేదు. దానికి కార‌ణాలేవైనా.. అలా కాకుండా రీతూ ఇంకా పెద్ద స్థాయి అవ‌కాశాలు అందుకుంటుంద‌నే అభిమానులు ఆశిస్తున్నారు.