15 రోజుల్లో ఎన్నికల ఏర్పాట్ల కసరత్తు

15 రోజుల్లో ఎన్నికల ఏర్పాట్ల కసరత్తు

తెలంగాణలో ఎన్నికల సంసిద్ధతను అంచనా వేసేందుకే వచ్చామని, తమ పర్యటన ముగిసిందని, హైదరాబాద్ నుంచి వెళ్లాక తమ నివేదికను ఈసీకి సమర్పిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం అధికారి ఉమేశ్ సిన్హా  చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు, అధికారుల అభిప్రాయలు తీసుకున్నామని, ఓటర్ల జాబితా సవరణకు రాజకీయ పార్టీలు గడువు కోరాయని చెప్పారు. భద్రాచలం నియోజకవర్గం అంశం తమ దృష్టికి వచ్చిందని, దాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘమే నిర్ణయం తీసుకుంటుందని.. ఎన్నికల ఏర్పాట్లు, భద్రతపై ఎస్పీలు, కలెక్టర్లతో చర్చించినట్లు పేర్కొన్నారు. 

ఇక ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రప్రభుత్వ కసరత్తు సరైన దిశలోనే సాగుతోందన్న ఉమేశ్ సిన్హా..  15 రోజుల్లో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల ప్రక్రియ ముమ్మరం చేస్తామన్నారు. ఎస్‌ఎంఎస్ ద్వారా ఓటర్ జాబితాలో పేరు ఉందో లేదో కనుక్కునే సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. అతి త్వరలో ఎస్‌ఎంఎస్ ఆన్‌లైన్ గేట్‌వే ప్రారంభిస్తామని చెప్పారు. డీఎల్‌వోలు కాకుండా ఉన్నతాధికారులు కూడా పోలింగ్ స్టేషన్లవారీగా వెరిఫికేషన్ ప్రక్రియలో పాల్గొనాలని ఆదేశించారు.