హైదరాబాద్ లో ఆర్గానిక్ ఫెస్టివల్

హైదరాబాద్ లో ఆర్గానిక్ ఫెస్టివల్

హైదరాబాద్ లో కేంద్ర మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యాన ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ జరుగుతుంది. మాదాపూర్ శిల్పారామంలోని సంప్రదాయ వేదికలో జరుగుతున్న ఆర్గానిక్ ఫెస్ట్ కు ఆదరణ బాగా పెరిగింది. మహిళా వ్యాపారులే స్వయంగా స్టాల్స్ పెట్టి అమ్మకాలు కొనసాగిస్తుండటంతో నగర వాసులు క్యూ కడుతున్నారు. మిల్లెట్స్, రెడ్, బ్లాక్ రైస్, కూరగాయలు, కాస్మోటిక్స్, బెకరీ ఐటెమ్ లు , పచ్చళ్లు ఒకటేమిటీ అన్ని వస్తువులు అమ్ముతున్నారు.  ఈ ఫెస్ట్ లో మహిళా పారిశ్రామికవేత్తలు,సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, ఎన్జీవో లే తమ స్టాళ్లను ఏర్పాటు చేసాయి. ఈ నెల పదో తారీఖు వరకు ఆర్గానిక్ ఫెస్టివల్ కొనసాగుతుంది.