ధోనీ ముందు మరో వరల్డ్ రికార్డు

ధోనీ ముందు మరో వరల్డ్ రికార్డు

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మరో వరల్డ్ రికార్డును బ్రేక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. దశాబ్దంన్నరకు పైగా భారత జట్టుకు  ప్రాతినిధ్యం వహిస్తున్న ధోనీ.. ఒకవైపు బ్యాట్స్‌మెన్‌గా, మరోవైపు వికెట్ కీపర్‌గా సమర్ధంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కెరీర్ మొదటి నుంచి ధోనీ వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ధోనీ ముందు ఓ రికార్డు ఉంది.

మహేంద్రసింగ్ ధోనీ భారత్ తరపున ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 594 మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు. మరో మూడు మ్యాచులు ఆడితే.. ప్ర‌పంచ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన వికెట్‌ కీపర్‌గా ధోనీ రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్ 596 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 594 మ్యాచ్‌లతో ధోనీ రెండవ స్థానంలో ఉన్నాడు. శ్రీలంక మాజీ వికెట్ కీపర్ కుమార సంగక్కర 499 మ్యాచ్‌లతో మూడో స్థానంలో.. ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ 485 మ్యాచ్‌లతో నాలుగో స్థానంలో ఉన్నారు.