అహ్మదాబాద్‌లో అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం

అహ్మదాబాద్‌లో అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ గ్రౌండ్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్మించబోతున్నారు. అహ్మదాబాద్‌లో గల సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ స్టేడియం (మోటేరా స్టేడియం) త్వరలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ మైదానంగా గుర్తింపు దక్కించుకోబోతోంది. మొతెరా స్టేడియాన్నే పూర్తిగా మార్పులు చేసి ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా రూపుదిద్దనున్నట్లు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పరిమల్ నథ్వానీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం, మెల్‌బోర్న్‌ కంటే పెద్దదైన మైదానం అహ్మదాబాద్‌లోని మోటేరాలో నిర్మాణంలో ఉంది. గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కలల ప్రాజెక్ట్‌ అయిన ఈ మైదానం పూర్తయితే.. భారత్‌కు ఖ్యాతి తీసుకొస్తుంది' అని నిర్మాణ పనులకు  సంబందించిన పోటోలను పరిమల్‌ ట్వీట్‌ చేశారు.

మోటేరా స్టేడియంను 1982లో నిర్మించారు. ఈ మైదానం కెపాసిటీ 49 వేలు. ఈ మైదానంలో 1983లో తొలి టెస్టు మ్యాచ్‌ వెస్టిండిస్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగింది. 2011 డిసెంబరు వరకు మోటేరాలో 23 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. అనంతరం స్టేడియంను మూసివేసి విస్తరణ పనులు చేపట్టారు. ప్రస్తుతం ఈ స్టేడియం కెపాసిటీ 1,10,000. వచ్చే ఏడాది మోటేరా స్టేడియంను అందుబాటులోకి రానుంది.