తెలుగు సినీ రైటర్ ఆత్మహత్య యత్నం 

తెలుగు సినీ రైటర్ ఆత్మహత్య యత్నం 

తెలుగు సినీఇండస్ట్రీలో రైటర్ గా మంచి గుర్తింపు సంపాదించిన రాజసింహ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముంబైలోని ఓ హోటల్లో నిద్ర మాత్రలు ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో అపస్మారక స్థితిలో ఉన్నారు. కెరియర్ పరంగా సరైన అవకాశాలు లేకపోవడంతో బాగా ఒత్తిడికి లోనై ఈ దారుణానికి ఒడిగట్టారని తెలుస్తోంది. ఈ గతంలో బొమ్మరిల్లు, బోణి, కాళిదాసు చిత్రాలకు పనిచేశారు. రెండేళ్ల క్రితం దర్శకుడిగా సందీప్ కిషన్, నిత్య మీనన్ లతో ఒక్క అమ్మాయి తప్ప సినిమాను తీశాడు. కానీ అది రిలీజ్ కి నోచుకోకుండా..యు ట్యూబ్ లో పెట్టడం జరిగింది. ప్రస్తుతం అయన ఆరోగ్యపరిస్థితి గురించి ఎలాంటి సమాచారం లేదు.