పేలిన మరో రెడ్‌మీ స్మార్ట్ ఫోన్

పేలిన మరో రెడ్‌మీ స్మార్ట్ ఫోన్

ఈ మధ్య కాలంలో చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ షావోమీ మార్కెటింగ్ చేస్తున్న రెడ్‌మీ ఫోన్లు వరుసగా పేలుతున్నాయి. ఈ క్రమంలో మరో రెడ్‌మీ ఫోన్ పేలిన ఘటన వెలుగులోకి వచ్చింది. శంషాబాద్ కు చెందిన చిట్టిబాబు అనే యువకుడు ఇటీవలి కాలంలో 'రెడ్ మీ 4 ఏ' స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేశాడు. చిట్టిబాబు కూరగాయల కోసం కూరగాయల మార్కెట్ వెళ్ళాడు. అదే సమయంలో జేబులో ఉన్న సెల్ ఫోన్ రింగ్ అయింది. బయటకు తీస్తుండగానే ఫోన్ నుంచి పొగలు వచ్చాయి, ఇది గమనించిన చిట్టిబాబు వెంటనే ఫోన్ ను కింద పడేశాడు. కొన్ని సెకండ్లలోనే అది పేలిపోయింది. ఈ ఘటనపై కంపెనీకి చిట్టిబాబు ఫిర్యాదు చేశారు.