బాలాపూర్ లో భారీగా డ్రగ్స్ స్వాధీనం

బాలాపూర్ లో భారీగా డ్రగ్స్ స్వాధీనం

సైబరాబాద్ రాచకొండ పరిధిలోని బాలాపూర్ లో పోలీసులు భారీగా డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి మయన్మార్ దేశంలో యబా గా పిలిచే డ్రగ్ ను  సీజ్ చేశారు. అబీబుష్ రెహ్మాన్, మొహ్మద్ రహీం ఇద్దరు  మయన్మార్ దేశస్థులు. శరణార్ధులు గా వచ్చి బాలాపూర్ లో ఉంటున్నారు. నగరంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతున్న వీరిద్దరు డబ్బుల కోసం డ్రగ్స్ లను విచ్చలవిడిగా అమ్ముతున్నారు.యబా డ్రగ్ ను టాబ్లెట్స్ రూపంలో తయారు చేసి నగరంలో విక్రయిస్తున్నారు.ఒక టాబ్లెట్స్  ను 200 నుండి 300 రూపాయల వరకు అమ్ముతున్నారు. అనుమానం వచ్చి విచారణ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డ్రగ్ పెడ్లర్స్ అయిన వారి ఇద్దరి నుంచి మొత్తం 190 టాబ్లెట్ లను పోలీసులు సీజ్ చేసారు. ఒక టాబ్లెట్ డ్రగ్ నషా మూడు రోజులు పనిచేస్తుంది.మయన్మార్, థాయిలాండ్, బంగ్లాదేశ్ లో ఎక్కువగా లభించే ఈ డ్రగ్ ను,అక్కడి నుండి మన దేశానికి తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.వారి నుండి మరింత  సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని  రాచకొండ సీపీ మహేష్ భగత్ తెలిపారు.