ఎన్నికలు వస్తాయనే రాజీనామాలు చేసాం

ఎన్నికలు వస్తాయనే రాజీనామాలు చేసాం

మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం.. ఎన్నికలు వస్తాయనే రాజీనామాలు చేసాం అని వైసీపీ మాజీ ఎంపీ సుబ్బారెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... మొదటి నుంచి హోదా కోసం పోరాటం చేసిన పార్టీ వైసీపీ అని అన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. ప్రధాని మోడీతో వైసీపీ కలిసింది అనే తప్పుడు ప్రచారం చంద్రబాబు చేస్తున్నారు.. మోడీతో కలిస్తే మాపై కేసులు ఎందుకు పెడతారు అని ప్రశ్నించారు. పన్ను ఎగవేత, అక్రమ సొమ్ము ఉన్నవారిపై ఐటీ దాడులు జరుగుతాయన్నారు. ఐటీ దాడులు కూడా రాజకీయం  చేస్తున్నారని సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఎన్నికలు రాకుండా రాజీనామా చేశామని యనమల విమర్శలు సరికాదన్నారు. ఎంపీలు బుట్టా, స్పై రెడ్డి, కొత్తపల్లి గీతలపై అనర్హత వేటేస్తే ఎన్నికలకు వెళ్లే వాళ్ళం కదా అని ఆయన అన్నారు. ఏపీలో వెనుక బడిన జిల్లాలకు కేంద్రం నిధులు ఇవ్వకపోవటానికి ప్రభుత్వం పోరాటం చేయక పోవడమే కారణం అని అన్నారు.