రాష్ట్రాన్ని టీడీపీ, బీజేపీ బ్రష్టు పట్టిస్తున్నాయి..

రాష్ట్రాన్ని టీడీపీ, బీజేపీ బ్రష్టు పట్టిస్తున్నాయి..

ఈ నెల 17న ఏలూరులో వైసీపీ ఆధ్వర్యంలో బిసి గర్జన సభ జరుగుతుందని పార్టీ సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణలు  చెప్పారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. బిసి అధ్యయన కమిటీ సమర్పించిన నివేదికను సభలో వైసీపీ అధినేత జగన్ ప్రకటించనున్నారని తెలిపారు.బీసీ వర్గాల అభివృద్ధి కోసం వైసీపీ అమలు చేసే సంక్షేమ కార్యక్రమాల వివరాలు సభలో ప్రకటిస్తారని ఇరువురు నేతలు స్పష్టం చేసారు . అధికారం అడ్డంపెట్టుకొని  టీడీపీ రకరకాల జిమ్మిక్కులు చేస్తుందని  మండిపడ్డారు.  రోజుకొక నాటకంతో బీసీలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఢిల్లీలో చంద్రబాబు ప్రత్యేకహోదా కోసం దొంగ దీక్షలు... కొంగ జపం చేస్తున్నాడని విమర్శించారు. ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీ  ముఖ్యమని చంద్రబాబు చెప్పారని.. సాక్షాత్తు ప్రధాని మోడీ  ఇదే విషయం తెలిపారని చెప్పుకొచ్చారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ఆంధ్ర రాష్ట్రాన్ని బ్రష్టు పట్టిస్తున్నాయని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్సలు ఘాటుగా విమర్శించారు. రాష్ట్రాన్ని కాపాడు కోవాల్సిన బాధ్యత మనపై ఉందని వ్యాఖ్యానించారు.