అమిత్ షాతో బీజేపీ..వైకాపా నేతల చర్చ ..? 

అమిత్ షాతో బీజేపీ..వైకాపా నేతల చర్చ ..? 

ఢిల్లీలో బీజేపీ-వైసీపీ నేతల భేటీపై ఏపీ రాజకీయాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఢిల్లీలో వైసీపీ నేత బుగ్గన, బీజేపీ నేత ఆకుల సత్యనారాయణ ఒకే కారులో తిరిగారంటూ వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాకుండా ఢిల్లీలో అమిత్ షా-రామ్ మాధవుతో బుగ్గన భేటీ అయ్యారంటూ ఆరోపణలు గుప్పిస్తోంది టీడీపీ.

ఢిల్లీలో వారి భేటీ సమయంలో బయటకొచ్చిన వీడియోలే బీజేపీ-వైసీపీల కుమ్మక్కుకు నిదర్శనమని ఆరోపిస్తున్నారు మంత్రులు అచ్చెన్నాయుడు, అమర్నాధ్ రెడ్డి. అలాగే బీజేపీకి.. వైసీపీ సిస్టర్ పార్టీ, ఏపీలో వైసీపీతో కుమ్మక్కు కావడం కారణంగానే బీజేపీ ఎంతో ధైర్యంతో ఆంధ్రప్రదేశ్ పై కుట్రలు పన్నుతోందని మంత్రులు విమర్శిస్తున్నారు. టీడీపీ నేతలు ఊహించుకొని.. గాలిపోసేగి  ఆరోపణలు చేస్తున్నాయని... అందులో ఎంతమాత్రం నిజం లేదని ఆకుల సత్యనారాయణ తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేను తాను ఏపీ భవన్ లో కలిశానని అంతకు మించి ఏం జరగలేదని టీడీపీ ఆరోపణలను ఆకుల సత్యనారాయణ పూర్తిగా ఖండించారు.