చంద్రబాబు తీరే వేరయా : అంబటి

చంద్రబాబు తీరే వేరయా : అంబటి

నాలుగేళ్లు బీజేపీతో అంటకాగిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని మోడీ పర్యటనను అడ్డుకునే నైతిక హక్కులేదని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. విజయవాడలో మీడియాతో అంబటి మాట్లాడుతూ. ఏపీకి బీజేపీ తీరని అన్యాయం చేసిందన్నమాట వాస్తమేనని, దానికి ప్రధాన కారణం చంద్రబాబే అని అన్నారు. 2017లో రాహుల్‌ గాంధీ ఏపీ పర్యటనకు వస్తే చంద్రబాబు నల్లజెండాలతో నిరసన తెలిపారని, ఇప్పుడు రాహుల్‌ కాళ్లు పట్టుకునే స్థితికి దిగజారిపోయారని ఘాటుగా విమర్శించారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం గతంలో తాము పోరాటం చేస్తే అరెస్టులు చేసి అణచివేశారని,  ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నదేమిటని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష అంటూ చంద్రబాబు 10 కోట్లు ఖర్చు చేయబోతున్నారని, ఇది ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడమేనని ఆయన మండిపడ్డారు.