ఇన్‌స్టాగ్రామ్‌లో యంగ్ టైగర్...

ఇన్‌స్టాగ్రామ్‌లో యంగ్ టైగర్...

అంతా స్మార్ట్ కాలం... నచ్చిన స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండాలి... సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలి... ఇక తమకు నచ్చిన నటులను సెలబ్రిటీలను ఫాలో అవుతూ... పోస్ట్ చేయగానే లైక్‌లు, షేర్లు, రీట్వీట్లు... ఇలా సాగుతోంది. మన సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటున్నారు... ఇప్పటికే ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీల లిస్ట్‌లో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్... ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అడుగుపెట్టాడు. తారక్ ఇలా ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా ప్రారంభించాడో లేదో... కొన్ని గంటల్లోనే ఆయనను ఫాలో అయ్యేవారి సంఖ్య 60 వేలు దాటిపోయింది. ఫోటోస్, వీడియోస్ షేరింగ్ ఫ్లాట్‌ఫామ్‌గా మంచి క్రేజ్ ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌లో తారక్ ఇప్పటి వరకు ఎలాంటి పోస్ట్‌లు పెట్టకపోయినా... ఆయన పోస్ట్ చేసే ఫొటోలు, వీడియోలు అభిమానులకు కనువిందు చేయడం గ్యారెంటీ మరి.