కొండచిలువ రూ.24 వేలు.. కొంటారా? 

కొండచిలువ రూ.24 వేలు.. కొంటారా? 

ప్రవీణ్‌, శరణ్‌ అనే ఇద్దరు యువకులు ఓ వ్యక్తి దగ్గర కొండ చిలువ, ఓ పామును కొనుగోలు చేశారు. వాటికి ఎక్కువ ధరకు విక్రయించి లాభాలు ఆర్జించాలన్నదే వారి ప్లాన్‌. తమ దగ్గర పాములున్నాయని తెలిసేలా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లో పోస్టులు పెట్టారు. ప్రవీణైతే ఏకంగా కొండచిలువతో ఫోజులిచ్చి.. దాన్ని రూ.24 వేలకు అమ్ముతామంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టాడు. ఈ ఫొటోలు ఫేస్‌బుక్‌లో వైరల్‌ కావడంతో విషయం అటవీశాఖ దాకా వెళ్లింది. అధికారులు రంగంలోకి దిగి.. సదరు నిందితుల ఇంటిపై దాడిచేసి రెండు పాములను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, కోర్టు ఎదుట హాజరుపరిచి.. రిమాండ్‌కు తరలించారు. యువకులది మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం చౌదర్‌గూడ అని పోలీసులు చెప్పారు.