ఢిల్లీ దీక్షకు తరలివచ్చిన టీడీపీ యువనేతలు

ఢిల్లీ దీక్షకు తరలివచ్చిన టీడీపీ యువనేతలు

ఏపీకి కేంద్రం చేసిన అన్యాయానికి నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ధర్మాపోరాట దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఏపీ భవన్‌లో కోలాహలం నెలకొంది. దీక్షకు ఏపీ నుంచి పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరలివచ్చారు. మరోవైపు చంద్రబాబు దీక్షకు టీడీపీ యువ నేతలు సంఘీభావం తెలిపారు. దేవినేని అవినాష్, కరణం వెంకటేశ్, పరిటాల శ్రీరాం తదితరులు ఢిల్లీలోని ఏపీ భవన్ కు తరలివచ్చారు. ప్రధాని మోడీ తన స్ధాయి దిగజారి మాట్లాడుతున్నారని టీడీపీ యువనేతలు ఆరోపించారు. వెనుకబడిన జిల్లాలకు అన్యాయం చేశారని అన్నారు. దేశ యువత బీజేపీకి బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. చంద్రబాబు చేసిన విమర్శల గురించి ప్రధాని మోడీ ఆలోచించాలని టీడీపీ యువనేతలు అన్నారు.