జగన్‌పై దాడి కేసు.. నిందితుడికి 25వరకు రిమాండ్

జగన్‌పై దాడి కేసు.. నిందితుడికి 25వరకు రిమాండ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్‌ను పోలీసులు బెజవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో హాజరుపర్చారు. నిందితుడికి ఈ నెల 25 వరకు కోర్టు రిమాండ్ విధించింది. శ్రీనివాస్‌ను విజయవాడ సబ్‌ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. నిందితుడు శ్రీనివాస్‌ను కస్టడీకి ఇవ్వాలని కోర్టులో ఎన్‌ఐఏ పిటిషన్‌ దాఖలు చేసింది. ఎన్‌ఐఏ పిటిషన్‌పై నిందితుడు శ్రీనివాస్‌ తరపు లాయర్‌ కౌంటర్‌ దాఖలు చేయకపోవడంతో.. ఎన్‌ఐఏ పిటిషన్‌ను విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టు పెండింగ్‌లో పెట్టింది. నిందితుడు శ్రీనివాస్ తరఫున న్యాయవాదులు హాజరు కాలేదు. దీంతో కస్టడీ పిటిషన్ కాపీను నిందితుడు శ్రీనివాస్‌కే కోర్టు అందజేసింది.