జగన్ హత్యాయత్నం కేసు రేపటికి వాయిదా

జగన్ హత్యాయత్నం కేసు రేపటికి వాయిదా

హై కోర్ట్ లో వైఎస్ జగన్ అత్యాయత్నం కేసు విచారణ రేపటికి వాయిదా పడింది. జగన్ అత్యాయత్నం కేసు వివరాలను రేపు కోర్ట్ ముందు ఉంచాలని ఏపీ అడ్వకేట్ జనరల్ ను ఆదేశించింది. హత్యాయత్నం కేసును హైకోర్టు ఈ రోజు విచారించింది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వ సంస్థలతో విచారణ జరపాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ కు విచారణ అర్హత ఉందా లేదా అన్న విషయంను రేపు నిర్ణయిస్తామని తెలిపింది. అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలను తమముందు ఉంచాలని ఏపీ అడ్వొకేట్ జనరల్ ను కోర్ట్ ఆదేశించింది. కేసును తప్పుదోవ పట్టించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ ఆర్పీ ఠాకూర్ వ్యవహరించారని జగన్ తరఫు న్యాయవాది ఆరోపించారు. మరోవైపు ఈ ఆరోపణలను ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్ ఖండించారు. పోలీసుల విచారణకు జగన్ సహకరించడం లేదని, పోలీసులకు సహకరించాల్సిందిగా పిటిషనర్ ను ఆదేశించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన కత్తి దాడి ఘటనపై జగన్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తుపై నమ్మకం లేదని.. అది పూర్తిగా రాజకీయ కోణంలో జరుగుతోంది కనుక స్వతంత్ర్య దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు జరిపించాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.