జగన్ గృహప్రవేశం వాయిదా..

జగన్ గృహప్రవేశం వాయిదా..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గృహప్రవేశం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 14వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు మంగళగిరి సమీపంలోని తాడేపల్లిలో నూతన గృహ ప్రవేశం చేయాల్సిఉంది. అదే రోజు నూతన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు వైసీపీ అధినేత...  అయితే, ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు ప్రకటించారు మాజీ ఎంపీ, వైసీపీ పొలిటికల్ సెక్రటరీ వైవీ సుబ్బారెడ్డి. వైఎస్ షర్మిల, అనిల్ అనారోగ్యం (జ్వరం) కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమం మళ్లీ ఎప్పుడు జరిగేది త్వరలోనే తెలియజేస్తామని ఓ ప్రకటన విడుదల చేశారు వైవీ సుబ్బారెడ్డి.