జగన్ పాదయాత్ర ప్రారంభం

జగన్ పాదయాత్ర ప్రారంభం

ప్రజా సమస్యలు తెలుసుకోవడం, ప్రజలతో మమేకవడమే లక్ష్యంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మొదలు పెట్టిన ప్రజాసంకల్ప యాత్ర విజయవంతంగా 188వ రోజుకు చేరుకుంది. జగన్‌ ఈ రోజు ఉదయం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రైల్వేష్టేషన్‌ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఇక్కడి నుండి ప్రారంభమైన జగన్ పాదయాత్ర అడుశంభునగర్‌, లక్ష్మీనరసింహా నగర్‌ మీదుగా ధవళేశ్వరం చేరుకుంటుంది. అక్కడ భోజన విరామం తీసుకుంటారు జగన్. అనంతరం ధవళేశ్వరం, బొబ్బర్లంక, పేరవరం వరకు పాదయాత్ర కొనసాగుతుంది.