వచ్చేవారం నుంచి జగన్ పాదయాత్ర...

వచ్చేవారం నుంచి జగన్ పాదయాత్ర...

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్రను పునఃప్రారంభించనున్నారు... విశాఖ విమానాశ్రయంలో దాడికి గురైన జగన్... వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటుండగా... ఈ నెల 12వ తేదీ నుంచి ప్రజా సంకల్ప యాత్ర తిరిగి ప్రారంభ అవుతోందని వైసీపీ శ్రేణులు ప్రకటించాయి. సోమవారం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుండగా... ఆదివారం సాయంత్రం విశాఖపట్నం బయల్దేరివెళ్లనున్నారు జగన్... ఇక సోమవారం ఉదయం విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని మక్కువ మండలం పాయకపాడు క్యాంపు నుండి జగన్ పాదయాత్ర ప్రారంభంకానుంది.