జగన్‌కు స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు...

జగన్‌కు స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు...

ప్రజాసంకల్ప యాత్ర ముగిసిన తర్వాత తొలిసారి సొంతం జిల్లాకు వస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి వైసీపీ శ్రేణులు... నిన్న శ్రీవారిని దర్శించుకున్న జగన్ ఇవాళ ఉదయం 8 గంటలకు తిరుమల నుంచి బయల్దేరనుండగా ఉదయం 9 గంటలకు కడప జిల్లాలో అడుగుపెట్టనున్నారు... కడప జిల్లాలోని కోడుమూరు నియోజకవర్గం కుక్కలదొడ్డి గ్రామంలో జగన్‌కు స్వాగతం పలకనున్నారు కడప జిల్లా వైసీపీ శ్రేణులు. అక్కడే కొందరు నేతలు టీడీపీ నుంచి వైసీపీలు చేరనున్నారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. ఇక రాజంపేట మీదుగా కడపకు చేరుకోనున్న జగన్... సాయంత్రం 5 గంటలకు కడప దర్గాను దర్శించుకోనున్నారు. మూడు రోజుల పాటు కడప జిల్లాలోనే పర్యటించనున్న వైసీపీ అధినేత... రేపు ఉదయం 8 గంటలకు పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌ దగ్గర నివాళులర్పించనున్నారు.