అమీన్ పీర్ దర్గాను దర్శించిన జగన్

అమీన్ పీర్ దర్గాను దర్శించిన జగన్

ప్రజా సంకల్ప యాత్ర ముగించుకుని కడప జిల్లాకు విచ్చేసిన ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత జగన్ అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్నారు. జగన్ అభిమానులు, కార్యకర్తలు దర్గా వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దర్గా పెద్దలు జగన్ ను లోపలికి ఆహ్వానించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, చాదర్ సమర్పించారు. సుదీర్ఘ పాదయాత్ర ప్రారంభానికి ముందు వైఎస్‌ జగన్‌ తిరుమల శ్రీవారిని, అమీన్‌ పీర్‌ దర్గాను దర్శించిన సంగతి తెలిసిందే.