జనగోదావరిని చూసి బాబుకు భయం పట్టుకుంది

జనగోదావరిని చూసి బాబుకు భయం పట్టుకుంది

వైఎస్ జగన్‌ గోదావరి వంతెనపై పాదయాత్ర జనగోదావరిని తలపించిందన్నారు వైసీపీ మహిళా నేత లక్ష్మీపార్వతి. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ... జగన్ కు వస్తోన్న ప్రజా స్పందనను చూసి చంద్రబాబు భయపడుతున్నారని అన్నారు. దాన్ని జీర్ణించుకోలేని సీఎం ఇప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ పై మాట్లాడుతున్నాడని ఆమె మండిపడ్డారు.  

చంద్రబాబుకు ఇప్పుడు ఓటమి భయం పట్టుకుందని..‌ తాను ఓడిపోతానని అనుకున్నప్పుడల్లా  ఈవీఎంల ట్యాంపరింగ్ పై చర్చ లేపుతున్నాడని ఆమె ఆరోపించారు. ఈవీఎంలను దొంగతనం చేసిన వారికి చంద్రబాబు ఐటీ సలహాదారుడి పోస్ట్ ఇచ్చారని ఆమె ఎద్దేవా చేశారు. 2014 లో చంద్రబాబు ట్యాంపరింగ్ చేసి గెలిచాడా? అంటా ఆమె ప్రశ్నించారు. ట్యాంపరింగ్ జరగడానికి అవకాశం లేదని ఎన్నికల కమీషన్ స్పష్టంగా చెప్పినా.. మళ్లీ చంద్రబాబు అదే విషయాన్ని మాట్లాడుతన్నారని తెలిపారు. ఈవీఎంల ట్యాంపరింగ్ ఎలా చేయాలో తెలిసిన దొంగలు చంద్రబాబు నాయుడు పక్కన వున్నారని వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ట్యాంపరింగ్ చేస్తాడనే భయం తమకు ఉందని..దీనిపై ఎన్నికల సంఘానికి మేమే ఫిర్యాదు చేస్తామని లక్ష్మీపార్వతి వివరించారు.