పవన్‌ వ్యాఖ్యలపై వైసీపీ సీరియస్‌...

పవన్‌ వ్యాఖ్యలపై వైసీపీ సీరియస్‌...

తమతో పొత్తులకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్‌గా స్పందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ... టీఆర్ఎస్ నేతలు సంప్రదించారని జనసేనాని చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్నారు. పవన్ వ్యాఖ్యలపై స్పందించిన వైసీపీ అధికార ప్రతినిధి సుధాకర్ బాబు... వైసీపీ ఎవరి పొత్తుల కోసం వెంపర్లాడటం లేదన్నారు. పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం వైసీపీకి లేదని స్పష్టం చేసిన ఆయన... తనతో మాట్లాడిన టీఆర్ఎస్ వాళ్లు ఎవరు పవన్ కల్యాణ్ చెప్పాలని డిమాండ్ చేవారు. పవన్ దగ్గరికి వెళ్లినవాళ్లు అధికారికంగా వచ్చారో... వ్యక్తిగతంగా వచ్చారో చెక్‌ చేసుకుని మాట్లాడాలని సూచించారు. మరోవైపు పవన్ కల్యాణ్... టీడీపీతో చేసుకున్న రహస్య ఒప్పందం బయటపెట్టాలని డిమాండ్ చేశారు సుధాకర్ బాబు.