టీడీపీ చెప్పుచేతుల్లో ఈడీ అధికారులు...

టీడీపీ చెప్పుచేతుల్లో ఈడీ అధికారులు...

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులను తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పుచేతుల్లో ఉంచుకున్నారని ఆరోపించారు మాజీ మంత్రి, వైసీపీ నేత తమ్మినేని సీతారాం... ఈడీ కేసుల్లో ముద్దాయిగా వైఎస్ భారతి అంటూ మీడియాలో వార్తలు వచ్చాయని... కొన్ని మీడియాలకు మాత్రమే ఈ వార్త ఎలా చేరిందని ఆయన ప్రశ్నించారు. ఈడీలో టీడీపీ నాయకులు కలసి పని చేస్తున్నారని విమర్శించిన తమ్మినేని... ఈడీ ఉద్యోగులు ఉమాశంకర్ గౌడ్, గాంధీ... టీడీపీ నాయకులకు బంధువులని... గతంలో వీరిపై జగన్ ప్రధాని నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేశారని తెలిపారు. 

ఏడేళ్ల తర్వాత ఈడీ... భారతిని ముద్దాయిగా చూపడం సరికాదన్న వైసీపీ నేత... వైఎస్‌ జగన్‌ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. చట్టప్రకారం పన్నులు చెల్లించిన సొమ్ము అవినీతి ఎలా అవుతోందని ప్రశ్నించిన తమ్మినేని సీతారాం... వైఎస్‌ జగన్ ను కేసులలో ఇరికించి రాజకీయంగా అడ్డుతొలగించుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 2009 నుంచి జగన్‌ను అడ్డు తొలగించుకోవడానికి ఢిల్లీలో కుట్రలు పన్నుతున్నారని... జగన్ ముఖ్యమంత్రి అయితే టీడీపీ పని అయిపోతుందని తెలిసి అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. ఏడేళ్ల తర్వాత భారతి పేరును చార్జ్‌షీట్‌లో ఎలా చేరుస్తారో ప్రధాని సమామాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీతో చాటుమాటు వ్యవహారాలు నడుపుతోందని... టీడీపీ త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో విలీనం అవుతోందని జోస్యం చెప్పారు తమ్మినేని