ఒక్కసారి అయితే జీవితకాలం జగనే సీఎం..!

ఒక్కసారి అయితే జీవితకాలం జగనే సీఎం..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్క సారి ముఖ్యమంత్రి అయితే... జీవిత కాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని తెలిపారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని... విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఇక చంద్రబాబు టైం అయిపోయింది... కనీసం ఈ 120 రోజులు మంచి చేసి పోతే మంచిదన్నారు. మరో 120 రోజుల్లో రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుందని వ్యాఖ్యానించిన వైసీపీ ఎమ్మెల్యే... ముఖ్యమంత్రి చిల్లర కార్యక్రమాలు అపేయాలని హెచ్చరించారు. ఇక ఐదు సార్లు ఓడి... దొడ్డిదారిన మంత్రైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని మండిపడ్డారు నాని. జగన్ సైకో కాదు... చంద్రబాబే నిజమైన సైకో అన్ని ఆయన... మాది కోడి కత్తి పార్టీ ఐతే... మరి టీడీపీ కట్టప్ప కత్తి పార్టీ నా!? అని ప్రశ్నించారు.