వన్డే ప్రపంచకప్‌ ఆడతా..

వన్డే ప్రపంచకప్‌ ఆడతా..

ఒకప్పుడు ఒంటిచేత్తో టీమిండియాకు మరువలేని విజయాలు అందించిన డాషింగ్ బ్యాట్స్‌మన్‌ యువరాజ్‌ సింగ్‌.. దాదాపు కనుమరగైపోయాడు. ఎప్పుడో ఐపీఎల్‌లో కనిపించడమే తప్పా.. జాతీయ జట్టు జెర్సీలో కనిపించి ఏడాదిన్నర దాటేసింది. రంజీల్లో ఆడుతున్నా.. స్థాయికి తగ్గ స్కోర్లు చేయలేక.. పంజాబ్‌ జట్టుకు భారంగానే మిగిలిపోయాడు. ఐతే.. ఇంగ్లాండ్‌లో జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో ఆడేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు యువరాజ్‌. ప్రస్తుతం రంజీ ట్రోఫీ చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడబోతున్నానని.. తర్వాత జాతీయ టీ20 టోర్నీ, ఐపీఎల్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తానని చెబుతున్నాడు.  మెరుగైన ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిలో పడతానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఇక..ఫామ్‌లో ఉన్నప్పుడే రిటైర్‌ అవుతానన్న యువరాజ్‌.. ఆటకు వీడ్కోలు పలికేటప్పుడు అత్యుత్తమంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పాడు.