చంద్రబాబువి వెన్నుపోటు రాజకీయాలు 

చంద్రబాబువి వెన్నుపోటు రాజకీయాలు 

స్వార్థ రాజకీయాల కోసం టీడీపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబువి ఎప్పుడూ వెన్నుపోటు రాజకీయాలే అన్ని స్పష్టం చేశారు.. మా రాజీనామాలపై చంద్రబాబు, యనమల మాట్లడటం సరికాదన్నారు. చిత్త శుద్ధితో ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. 

పగలు కాంగ్రెస్ తో, రాత్రిళ్లు బీజేపితో చంద్రబాబు ఒప్పందాలు. చంద్రబాబు ఎప్పుడు మాకు మిత్రుడే అని పార్లమెంట్ సాక్షిగా  రాజ్ నాధ్ సింగ్ చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నా చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేయించారు. ఎన్నికల కమీషన్ గైడ్ లైన్స్ ప్రకారం 14 నెలల ముందు రాజీనామా చేశాం. చంద్రబాబు కోట్లాది రూపాయలు దోచుకున్నారు. ఆయనపై దాడులు జరగవు. దోచుకున్న వ్యక్తులే ఐటి దాడులు జరుగుతాయంటే కుట్ర అంటూ ప్రచారం చేస్తారు. హోదా కోసం గుంటూరులో 8 రోజులు  వైఎస్ జగన్ ఆమరణదీక్ష చేశారు. భగ్నం చేయించింది చంద్రబాబు కాదా? మేం ఎంపిలందరూ రాజీనామా చేసి ఆమరమదీక్ష చేశాం. ప్రజలు గమనిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెబుతారు. అని వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా విమర్శించారు.