ముమ్మిడివరం - ముమ్మిడివరం

ముమ్మిడివరం
ముమ్మిడివరం

2014 సాధారణ ఎన్నికలలో ముమ్మడివరం నియోజకవర్గం నుంచి టిడిపి విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్ధి దాట్ల బుచ్చిరాజు , వైసిపి అభ్యర్ధి జివిఎస్.శ్రీనివాసరావును 29538 ఓట్ల ఆధిక్యతతో ఓడించారు. అంతకుముందు 2009లో ఇక్కడ గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీష్ 2014లో పోటీ చేయలేదు. కాంగ్రెస్ అభ్యర్ధి జి.త్రినాథరావుకు కేవలం 1401 ఓట్లు మాత్రమే వచ్చి డిపాజిట్ కోల్పోయారు. బుచ్చిరాజు తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1978లో ఏర్పడిన ముమ్మడివరం నియోజవర్గం 2004 వరకు రిజర్వుడ్ గా ఉండి,

2009లో జనరల్ గా మారింది. లోక్ సభ స్పీకర్ గా పని చేస్తూ అకాల మరణం చెందిన గంటి మోహన్ చంద్ర బాలయోగి ఒకసారి గెలిచిన ముమ్మడివరం నియోజకవర్గానికి 11సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్ ఐదుసార్లు, టిడిపి ఆరుసార్లు గెలిచాయి. ప్రముఖ దళితనేత బత్తిన సుబ్బారావు గతంలో రెండుసార్లు కడియం, బూరుగుపూడిలలో గెలుపొందారు. 1989, 94లలో జరిగిన ఎన్నికలలో బత్తిన గెలిచారు. అయితే ఆయన ఆకస్మికంగా మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో బాలయోగి పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత 1998లో తిరిగి ఆయన అమలాపురం లోక్ సభ నియోజకవర్గానికి పోటీ చేసి గెలిచారు. శాసనసభకు ఎన్నికైన బాలయోగి , అప్పట్లో చంద్రబాబు క్యాబినెట్ లో ఉండగా, ఆ తర్వాత లోక్ సభ స్పీకర్ గా ఎన్నికయ్యారు. 1999లో కేంద్రంలో వాజ్ పేయి ప్రభుత్వం ఒక ఓటుతో పడిపోయినప్పుడు ఈయన నిష్పాక్షికంగా వ్యవహరించారన్న కీర్తి తెచ్చుకున్నారు. ఈయన 2002 మార్చిలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆకస్మికంగా మరణించారు.  ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో ఆయన విజయకుమారి నెగ్గారు. బత్తిన సుబ్బారావు కూడా గతంలో పి.వి.నరసింహారావు , జలగం మంత్రివర్గాలలో పని చేశారు. ఇక్కడ నుంచి చెల్లి వివికానంద రెండుసార్లు గెలిచారు. 2004లో ఇక్కడ గెలిచిన పి.విశ్వరూప్ 2009లో అమలాపరంలో గెలిచి వైఎస్ క్యాబినెట్ లో మంత్రి అయ్యారు. 2014లో లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. 1987లో ముమ్మడివరంలో విజయం సాధించిన మోకా విష్ణు ప్రసాదరావు అంతకుముందు అల్లవరంలో కూడా గెలిచారు. గతంలో ఇక్కడ ఉన్న చెయ్యేరు నియోజకవర్గంలో నడింపల్లి రామభద్రిరాజు ఒకసారి గెలిస్తే.. అమలాపురంలో రెండుసార్లు విజయం సాధించారు. 

Activities are not Found
No results found.