రాజమండ్రి రూరల్ - రాజమండ్రి రూరల్

రాజమండ్రి రూరల్
రాజమండ్రి రూరల్

2014 సాధారణ ఎన్నికలలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఐదో సారి విజయం సాధించారు. బుచ్యయ తన సమీప ప్రత్యర్ధి , వైసిపి నేత ఆకుల వీర్రాజుపై 18058 ఓట్లతో ఓడిపోయారు. రాజమండ్రి సీటును మిత్రపక్షమైన టిడిపినేత బుచ్చయ్యకు ఈ నీటు కేటాయించారు. బుచ్చయ్య చౌదరి రాజమండ్రిలో నాలుగుసార్లు గెలిచారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన రాయుడుకి 3137 ఓట్లు వచ్చి డిపాజిట్ గల్లతైంది. రాజమండ్రి రూరల్ సిట్టింగ్ టిడిపి ఎమ్మెల్యే చందన రమేష్ కు ఈసారి టిక్కెట్ ఇవ్వలేదు.
గతంలో కడియం నియోజకవర్గం ఉండేది, అది రద్దై రాజమండ్రి రూరల్ నియోజకవర్గం వచ్చింది. జక్కంపూడి రామ్మోహన్ రావు గతంలో కడియం నియోజకవర్గం నుంచి మూడుసార్లు గెలిచారు. 2009 ఎన్నికల సమయం నాటికి ఆయన ఆస్వస్థత గురవ్వగా, ఆయన భార్య విజయలక్ష్మి పోటీ చేసినా గెలవలేకపోయారు.  2014లో రాజానగరం నుంచి పోటీ చేసినా , ఫలితం దక్కలేదు. దళితనేత బత్తిన సుబ్బారావు కడియలో రెండుసార్లు గెలిస్తే, బూరుగుపూడి, ముమ్మడివరంలో మరో నాలుగుసార్లు గెలుపొందారు. వడ్డి వీరభద్రరావు ఇక్కడ రెండుసార్లు గెలిచారు. 1983లో టిడిపి తరపున అసెంబ్లీకి ఎన్నికైన గిరిజాల వెంకటస్వామి నాయుడు , 1998 రాజమండ్రి నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. 
జక్కంపూడి రామ్మోహరావు 2004లో గెలిచాక వైఎస్ మంత్రవర్గం పని చేశారు. 

Activities are not Found
No results found.