రాజానగరం - రాజానగరం

రాజానగరం
రాజానగరం

2014 సాధారణ ఎన్నికలలో రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరోసారి టిడిపి ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ గెలుపొందారు. తన సమీప వైసిపి అభ్యర్ధి జక్కంపూడి విజయలక్ష్మిని 5887 ఓట్ల ఆధిక్యతతో ఓడించారు. ఇక్కడ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఎ.నాగేశ్వరరావుకు 2420 ఓట్లు మాత్రమే వచ్చి డిపాజిట్ కోల్పోయారు. విజయలక్ష్మి మాజీ మంత్రి , దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు భార్య. ఈమె 2009లో రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గతంలోని బూరుగుపూడి నియోజకవర్గం రద్దై కొత్తగా ఏర్పడిన రాజానగరం నియోజకవర్గంలో టిడిపి అభ్యర్ధి పెందుర్తి వెంకటేష్ 2009లో కాంగ్రెస్ అభ్యర్ధి బూరుగుపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టూరి రవీంద్రపై విజయం సాధించారు. తెలంగాణ ఏర్పాటు నేపధ్యంలో రవీంద్ర కూడా ఎన్నికల ముందు టిడిపిలో చేరిపోయారు. 1955లో ఇక్కడ గెలిచిన ఎన్వీ రామారావు మరణం కారణంగా జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య వెంకటరత్నం గెలుపొందారు. 
1994లో ఇక్కడ నుంచి కె.వి.రామకృష్ణ గెలిస్తే, ఆ తరువాత 1999లో ఆయన భార్య అచ్చమాంబ ఆయన బదులు పోటీ చేసి గెలిచారు. 2004లో గెలిచిన చిట్టూరి రవీంద్ర, 1996లో రాజమండ్రి నుంచి లోక్ సభకు ఒకసారి ఎన్నికయ్యారు. నీరుకొండ వెంకటరామారావు 1955లో బెజవాడ గోపాలరెడ్డి క్యాబినెట్ లో ఉంటే, బత్తిన సుబ్బారావు పివి.జలగం క్యాబినెట్ లలో ఉన్నారు. 

Activities are not Found
No results found.