పోలీసుల హెచ్చరికలతో పవన్ పర్యటన వాయిదా

పోలీసుల హెచ్చరికలతో పవన్ పర్యటన వాయిదా

జనసేనాని పవన్ కళ్యాణ్ ఈనెల 21, 22, 23 తేదీల్లో చిత్తూరు, గుంటూరు జిల్లాలో పర్యటించాలని షెడ్యూల్ చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఈ పర్యటనలపై కొన్ని దృష్ట శక్తులు దృష్టి పడిందని..అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పర్యటనను రద్దు చేసుకోవాలని పోలీస్ నిఘా వర్గాలు జనసేన పార్టీకి హెచ్చరికలు జారీ చేశాయి. గతంలో జరిగిన తుని వంటి విధ్వంసకర చర్యలకు పాల్పడి పార్టీకి చెడ్డ పేరు తీసుకురావాలని చుస్తున్నారని, ఇందుకోసం పక్క రాష్ట్రాల నుండి కిరాయి మనుషులతో సంప్రదింపులు జరిపినట్లు మాకు సమాచారం అందిందని పోలీస్ నిఘా వర్గాలు తెలిపాయి.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడుతూ ప్రజల్లోకి వెళ్లాలనే మన ఆశల్ని ఎవరు వొమ్ము చేయలేరు. వివిధ జిల్లాలో సుదీర్ఘ పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం చేయాలనీ శ్రేణులను ఆదేశిస్తూ..జిల్లాలోని ప్రధాన సమస్యలను, రాష్ట్ర అభివృద్ధిలో తెలుగు దేశం పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ప్రత్యేక హోదా లక్ష్యంగా పర్యటిస్తానని, ఈ జిల్లాల పర్యటన మరో రెండు మూడు వారాల్లో ప్రారంభమయ్యేలా సన్నాహాలు జరుగుతున్నాయని పవన్ తెలిపారు.