మరో ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య

మరో ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య

తెలంగాణలో ఇంటర్‌ విద్యార్ధుల బలవన్మరణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంతో ఫెయిల్ అయ్యానని మనస్థాపం చెందిన ఓ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం తిరుమలాపూర్‌ గ్రామానికి చెందిన అంజయ్య కుమార్తె జ్యోతి చేవెళ్ల వివేకానంద కళాశాలలో ఇంటర్మీడియట్‌ సీఈసీ రెండో సంవత్సరం చదువుతోంది. ఇటీవల వెల్లడైన ఇంటర్‌ ఫలితాల్లో రెండో సంవత్సరం సివిక్స్ సబ్జక్ట్ లో ఫెయిల్ అయింది. దీంతో వారి కుటుంబ సభ్యులు ఓదార్చారు. అయినా ఫలితం లేకుండా పోయింది. తీవ్ర మనస్థాపంతో మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు మంటలను ఆర్పి ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. జ్యోతి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.