శుభవార్త: ఉద్యోగులకు దీపావళి కానుక

శుభవార్త: ఉద్యోగులకు దీపావళి కానుక

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త వినిపించింది కేంద్ర ప్రభుత్వం.. 5 శాతం డీఏ పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.. దీంతో దీపావళి ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. డీఏ పెంపుతో 50 లక్షల మంది ఉద్యోగులు లబ్ధిపొందనున్నారు... ఇక, 62 లక్షల మంది పెన్షనర్లకు కూడా డీఏ వర్తించనుంది. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఉద్యోగులకు ఇచ్చే కరువు భత్యం (డీఏ) 17 శాతానికి చేరిందన్నారు కేంద్ర మంత్రి. ప్రభుత్వ నిర్ణయంతో ఖజానాపై రూ.16వేల కోట్ల అదనపు భారం పడనుంది.