ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

లాక్‌డౌన్‌ కారణంగా అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది..ఏపీ ఎస్‌ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న 7,600ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల జీతాలను చెల్లించాలని ఆర్టీసీ ఎండీ ప్రతాప్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.... ఏప్రిల్ నెలకుగానూ ఉద్యోగులకు 90 శాతం జీతాలను చెల్లించాలని ఆయన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు... లాక్‌డౌన్‌ కారణంగా ఏపీ వ్యాప్తంగా దాదాపు రెండు నెలలుగా ఆర్టీసీ బస్సులు తిరగడం లేదు...దీంతో రాబటి లేకపోవడంతో ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలను యాజమాన్యం చెల్లించలేదు... ఇక ఇటీవల ఆర్టీసీ సేవలు పునః ప్రారంభం కావడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విన్నపం మేరకు జీతాలు చెల్లించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లుఆర్టీసీ ఎండీ ప్రతాప్‌ రెడ్డి తెలిపారు.