తృణమూల్ కార్యాలయంలో బాంబు పేలుడు

తృణమూల్ కార్యాలయంలో బాంబు పేలుడు

పశ్చిమ బెంగాల్ బెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలో బాంబు పేలుడు సంభవించింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జరిగిన ఈ ఘటనలో ఓ పార్టీ కార్యకర్త చనిపోగా, ఐదుగురు తీవ్ర గాయాలయ్యాయి. కలకత్తాకు 130 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. పేలుడు సంభవించిన ప్రాంతం యొక్క ఫోటోలను మీడియాకు విడుదల చేశారు. దీనిలో తృణమూల్ పార్టీ కార్యాలయం ముందు భాగంలో గుండ్రంగా ఉన్న కాంక్రీటు లోహపు కడ్డీలు, కాంప్లెక్స్ భాగాలు దెబ్బతిన్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఈ పేలుడు ఉదయం పదిగంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తుంది.