ట్విట్టర్ వన్ మిలియన్ క్లబ్ లో చేరిన రౌడీ

ట్విట్టర్ వన్ మిలియన్ క్లబ్ లో చేరిన రౌడీ

పెళ్లి చూపులు సినిమాతో హీరోగా నిలబడిన విజయ్ దేవరకొండకు టాలీవుడ్లో అభిమానులు అనేక పేర్లతో పిలుచుకుంటుంటారు.  అర్జున్ రెడ్డి సినిమా తరువాత  విజయ్ ను ముద్దుగా అర్జున్ రెడ్డిగా పిలుస్తున్నారు.  ఇపుడు రౌడీ అని పిలుస్తున్నారు.  విజయ్ సినిమా అంటే అందులో తప్పనిసరిగా ముద్దులు ఉండాల్సిందే అని విధంగా మారిపోయింది.  ముద్దులకు సౌత్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు విజయ్.  

సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తల్లో సోషల్ మీడియా ట్విట్టర్లోకి అడుగుపెట్టాడు.  2017లో ట్విట్టర్లో చేరిన విజయ్.. రెండేళ్లలోనే మిలియన్ మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు సొంతంగా కింగ్ ఆఫ్ ది హిల్ బ్యానర్ ను స్థాపించి మీకు మాత్రమే చెప్తా అనే సినిమా చేస్తున్నాడు.  నవంబర్ 1 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.