నాలుగో అంతస్తు నుంచి కిందపడిన చిన్నారి

నాలుగో అంతస్తు నుంచి కిందపడిన చిన్నారి

14 నెలల చిన్నారి నాలుగో అంతస్తు నుంచి కిందపడి మృత్యుంజయడిగా నిలిచిన ఘటన ముంబైలోని గోవండిలో చోటు చేసుకుంది. ఓ అపార్ట్ మెంట్ ప్లాట్ లోని బాల్కానికి గ్రిల్స్ లేకపోవడంతో చిన్నారి జారి కిందపడిపోయాడు. తీవ్రగాయాలవ్వడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారని, చిన్నారి ఆరోగ్యం నిన్నటి కంటే మెరుగైందని తల్లిదండ్రులు తెలిపారు. ప్లాట్ లోని బాల్కానీ కింద చెట్టు ఉండడంతో చిన్నారి దానిని తాకి నెల మీదపడిపోయాడు. ఆడుకుంటున్న తమ బాబు ఇంట్లో కనిపించకపోవడంతో బాల్కానీ నుంచి కిందికి చూడగా కిందికి పడిపోతు కనిపించాడు. వెంటనే కిందకు చేరుకున్న తల్లిదండ్రులు గాయాలతో ఉన్న చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాల్కానీ నుంచి వేగంగా కిందికి పడుతూ చెట్ల కొమ్మలపై పడి కిందికి చేరడంతో ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు తెలిపారు. ఆ చిన్నారి కుటుంబం సంవత్సరం నుంచి గోవాండీలోని గోపికృష్ణన్ బిల్డింగ్ లో నివాసముంటున్నారు. ఇంటిలో బాల్కానీలో గ్రిల్ ను మాత్రం బిగించకోలేదు. ఇంటిలో నుంచి బాల్కానీలోకి వెళ్లే తలుపు తీసి ఉంచడంతో చిన్నారి ఆడుకుంటూ వెళ్లి కిందపడిపోయాడు.