రేపు అమరావతిలో పది ఐటీ కంపెనీలు ప్రారంభం

రేపు అమరావతిలో పది ఐటీ కంపెనీలు ప్రారంభం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అందులో భాగంగానే హైదరాబాద్ కు దీటుగా అమరావతిని నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో అమరావతికి భారీగా ఐటీ కంపెనీలు వెళ్లాయి. బుధవారం రాజధాని అమరావతి ప్రాంతంలో మరో పది ఐటీ కంపెనీలు ప్రారంభం కానున్నాయి.  విజయవాడలోని ఎంకే ప్రీమియం, మేథాటవర్స్, మంగళగిరిలోని ఎన్‌ఆర్‌టీ టెక్‌ పార్కుల్లో ఉన్న ఐటీ కంపెనీలను ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన కంపెనీల్లో 3500 మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు. వచ్చే ఆరు నెలల్లో ఉద్యోగుల సంఖ్య మరో 1000 కి పెంచుతామని ఏపీఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు వేమూరు రవి తెలిపారు. హెచ్‌సీఎల్ లాంటి పెద్ద సంస్థలు కూడా అమరావతిలో తమ శాఖలను ఏర్పాటు చేయనున్నాయి.