లోయలో పడిపోయిన బస్సు, 10 మంది మృతి

లోయలో పడిపోయిన బస్సు, 10 మంది మృతి

ఉత్తరాఖండ్‌లో ఈ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది... రిషికేశ్ - గంగోత్రి జాతీయ రహదారిపై సూర్య ధర్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్‌కు చెందిన రాష్ట్ర రవాణా సంస్థ బస్సు లోయలో పడిపోవడంతో 10 మంది మృతిచెందగా... మరో తొమ్మిది మంది తీవ్రగాయాలపాలయ్యారు. గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంటుంది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. బస్సు అదుపుతప్పి దాదాపు 250 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో గాయపడ్డవారిని ఎయిమ్స్‌కు తరలించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసింది. మరోవైపు ఈ ప్రమాదంలో మృతిచెందినవారి కుటుంబాలకు రూ. 2 ల‌క్షలు, గాయ‌ప‌డ్డవారికి రూ. 50 వేల చొప్పున