గ్యాస్‌ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 10 మంది మృతి

గ్యాస్‌ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 10 మంది మృతి

గ్యాస్‌ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించి 10 మందికి పైగా మృతిచెందిన ఘటనలో చైనాలో జరిగింది. సెంట్రల్ చైనా ప్రాంతం హెనన్‌ ప్రావిన్స్‌లోని యిమాలో ఉన్న గ్యాస్ ప్లాంట్‌లో పేలుడు జరిగింది. పేలుడు ధాటికి 3 కిలోమీటర్ల పరిధిలోని ఇళ్ల అద్దాలు, తలుపులు బద్దలైనట్లు చైనా మీడియా పేర్కొంది. హెనన్‌ కోల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లోని ఎయిర్‌ సస్పెన్షన్‌ విభాగంలో సంభవించిన ఈ పేలుడులో 12 మందికి పైగా గల్లంతైనట్టు తెలుస్తుండగా.. మరో 18 మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు.