రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి

రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి

మహారాష్ట్రలోని ముంబయి-ఆగ్రా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని పర్యటనకు వెళ్లి తిరిగి మహారాష్ట్ర ఠానేలోని ఉల్హాస్ నగర్ ప్రాంతానికి కొంతమంది భక్తులు ఓ మిని బస్సులో బయలుదేరారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం నాసిక్‌  సమీపంలోని చాంద్వాడ్‌లో సోగ్రస్‌ ఫాటా ప్రాంతంకు వచ్చేసరికి మిని బస్సు టైర్ ఒక్కసారిగా పంచర్ అవ్వడంతో.. డ్రైవర్ నియంత్రణను కోల్పోయి రోడ్డుపై ఇసుక లోడ్‌తో నిలిపి ఉన్న ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది భక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చాంద్వాడ్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.