ఏపీలో ఆ దివ్యాంగులకు రూ.10 వేల పింఛన్‌

ఏపీలో ఆ దివ్యాంగులకు రూ.10 వేల పింఛన్‌

ఆంధ్రప్రదేశ్‌లోని పింఛన్లను రెట్టింపు చేసిన ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెండు చేతులూ లేని దివ్యాంగులకు నెలకు రూ.10 వేల పింఛన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ అమరావతిలో కీలక ప్రకటన చేశారు. ఇళ్లు, ఫించన్లు, రేషన్ వంద శాతం ఇవ్వగలిగామని ఆయన చెప్పారు. రూ. 1000 పింఛన్‌తో వృద్ధులను గౌరవిస్తున్నామన్న ఆయన.. పింఛన్లు లేని సమయంలో వృద్ధులను గౌరవించే వారు కాదని గుర్తుచేశారు. రూ. 2000 పింఛన్‌తో వృద్ధులను చూసుకోవడానికి పోటీ పడతారని అన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాల అమలుతోనే సంతృప్తి వస్తోందని బాబు అన్నారు.