ఈ తెలుగు హీరోయిన్లు వెరీ స్పెషల్ ఎందుకంటే..!!

ఈ తెలుగు హీరోయిన్లు వెరీ స్పెషల్ ఎందుకంటే..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీ గ్లామర్ కు పెద్దపీట వేస్తుంది.  కథను నమ్మి సినిమాలు తీసినా.. గ్లామర్ లేకుండా సినిమా నడవదు.  అందుకే అందమైన హీరోయిన్లను సినిమాల్లోకి తీసుకుంటుంటారు.  అందానికి అభినయం తోడైతే.. ఇక చెప్పాల్సిన అవసరం లేదు.  సినిమా బంపర్ హిట్టే.  

 

అయితే, తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి గత పదేళ్లుగా రాణిస్తున్న తారలు ఎందరో ఉన్నారు.  అలాంటి హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.  సక్సెస్ ఫుల్ హీరోయిన్ల జాబితాలో కాజల్ ముందు ఉంటుంది.  2007 లో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో పరిచయం అయ్యింది.  ఆ తరువాత తన కెరీర్లో అనేక హిట్ సినిమాలు చేసింది.  సినిమాలు ప్లాప్ అవుతున్నా.. అవకాశాలు మాత్రం తగ్గడం లేదు.  ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.  

 

మిల్కి బ్యూటీ తమన్నా.. 15 వంవత్సరాల వయసులో శ్రీ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.  సినిమా యావరేజ్ గా నిలిచినా.. తమన్నా మాత్రం ఇండస్ట్రీలో సెట్ అయ్యేందుకు అదొక మార్గదర్శకంగా నిలిచింది.  శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ సినిమా ఆమెకు బ్రేక్ ఇచ్చింది.  ఈ సినిమా తరువాత తమన్నా స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది.  

 

లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార.. ఆ పేరును సుస్థిరం చేసుకోవడానికి చాలా కష్టపడింది.  2003లో మలయాళం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నయనతార.. చంద్రముఖి సినిమాతో ఫేమ్ అయ్యింది.  ఆ తరువాత టాలీవుడ్, కోలీవుడ్ లో టాప్ హీరోలందరితో సినిమాలు చేసింది.  సోలో హీరోయిన్ గా నయనతార బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తోంది.  

 

నీ మనసు నాకు తెలుసు అంటూ టాలీవుడ్ కు పరిచయమైన త్రిష... నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, స్టాలిన్, సైనికుడు వంటి హిట్ చిత్రాలు చేసింది.  ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదేళ్లు దాటిపోయింది.  టాలీవుడ్ లో సినిమాలు చేయకపోయినా.. కోలీవుడ్ లో మాత్రం సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది.  

 

2005 లో సూపర్ సినిమాతో సూపర్బ్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అనుష్క శెట్టి.. అనతికాలంలోనే టాప్ పొజిషన్ కు చేరుకుంది.  రాజమౌళి దర్శకత్వంలో మూడు సినిమాలు చేసింది.  ఇది ఒక రికార్డు అని చెప్పాలి.  టాప్ హీరోలందరితో కలిసి నటించింది.  పవన్ కళ్యాణ్ తో కలిసి అనుష్క సినిమా చేయలేదు. అరుంధతి తరువాత ఈ హీరోయిన్ కు అవకాశాలు పెరిగాయి.  బాహుబలి ఆమె కెరీర్లో బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు.  

 

ఈ కోవలోనే 2001లో ఇష్టం సినిమాతో టాలీవుడ్ లోకి వచ్చి టాప్ హీరోలందరితో సినిమాలు చేసిన హీరోయిన్ శ్రీయ.  కెరీర్ స్టార్టింగ్ లో వరసగా హిట్ సినిమాలు చేసింది.  ప్రస్తుతం ఈ హీరోయిన్ కు అవకాశాలు తక్కువగా వస్తున్నాయి.  బాలకృష్ణ 105 వ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నది శ్రీయ.  ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదేళ్లు దాటినా ఇంకా ఈ హీరోయిన్లు సర్వైవ్ అవుతూనే ఉన్నారు.  టాలెంట్ ఉంటె ఎవరు అడ్డుకోలేరు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.