ఎద్దుల బండికి రూ. 1000 చలానా.. చివరకు.!!

ఎద్దుల బండికి రూ. 1000 చలానా.. చివరకు.!!

దేశంలో కొత్త చట్టం అమలులోకి వచ్చిన తరువాత వింత చట్టాలు అమలు చేస్తున్నారు.  ఈ చట్టాల కారణంగా చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  బైక్ హెల్మెట్ పెట్టుకోలేదని, మరొకటి మరొకటి లేదని చెప్పి చలానాలు వేస్తున్నారు.  ఈ చలనాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  కొన్ని చోట్ల చలానాలు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  అయితే, ఉత్తరాఖండ్ లోని ఛబ్రాలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది.  

ఛబ్రా గ్రామానికి చెందిన రియాజ్ హుస్సేన్ అనే ఓ వ్యక్తి ఎద్దులబండిపై తన పొలానికి వెళ్ళాడు.  బండికి పక్కన నిలిపి పొలం పనుల్లో మునిగిపోయాడు.  బండిని రోడ్డుపై పెట్టేశారు.  ఈలోగా అటుగా వెళ్తున్న పోలీస్ వాహనం ఆ బండికి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.  విషయం తెలుసుకున్న రియాజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లగా ఎద్దుల బండికి రూ. 1000 ఫైన్ వేశారు.  వాహన చట్టంలో ఎద్దుల బండికి ఫైన్ లేదని వాదించాడు.  చివరకు ఆ బండి ఓనర్ రియాజ్ ను మందలించి వదిలేశారు.  ఆ ఏరియాలో ఎద్దులబండి ద్వారా అక్రంగా ఇసుక రవాణా జరుగుతున్నట్టు వార్తలు వచ్చాయని, అందుకే విచారణ కోసం పిలిపించామని అన్నారు.