హైదరాబాద్ లో గంజాయి కలకలం

హైదరాబాద్ లో గంజాయి కలకలం

హైదరాబాద్ నగరంలో మరోసారి గంజాయి కలకలం రేగింది. అక్రమంగా రవాణా చేస్తున్న 100 కేజీల గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హయత్ నగర్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో విశాఖపట్నం నుంచి నగరంలోకి తీసుకువస్తున్న గంజాయిని పట్టుకున్నామని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వివేకానంద రెడ్డి తెలిపారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని గంజాయి, మారుతీ స్విఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దూల్ పేట్, కాటేదాన్, నారాయణ్ ఖేడ్ లలో గంజాయి వ్యాపారులకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ తెలిపారు.