కరోనాను జయించిన 107 ఏళ్ల బామ్మ... హెల్త్ సీక్రెట్ ఇదే...!!
కరోనాకు వయసుతో సంబంధం లేదు. ఎవరికైనా సోకవచ్చు. శరీరంలో వ్యాధినిరోధక శక్తి ఉన్న వారికి కరోనా సోకినా పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. కానీ, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండి, ఇతర జబ్బులు ఉంటె మాత్రం ఇబ్బందులు పడక తప్పదు. ప్రాణాలు పోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక 70, 80 ఏళ్ళు దాటిన వారికి కరోనా సోకితే ప్రాణాల మీద ఆశలు వదులుకోవడమే. అయితే, ఇటీవలే వంద దాటిన వ్యక్తులు కరోనాను జయిస్తున్నారు.
ఇలానే ఇంగ్లాండ్ కు చెందిన ఏంజెలా హ్యూటర్ కు 107 ఏళ్ళు. ఆమె ఏప్రిల్ నెలలో ఆమె కరోనా బారిన పడింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. కొన్ని రోజుల తరువాత వెంటిలేటర్ పై చికిత్స అందించారు. ఆమె బతకడం కష్టం అని వైద్యులు కూడా తేల్చి చెప్పారు. కానీ, అనూహ్యంగా ఆ బామ్మ కోలుకున్నది. కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న అత్యంత పెద్ద వయసు కలిగిన మహిళగా చరిత్ర సృష్టించింది. ప్రతి రోజు ఒక నారింజ పండును తినడం అలవాటు అని, అదే తనను కరోనా నుంచి గట్టెక్కేలా చేసిందని అన్నారు. 1918 లో స్పానిష్ ఫ్లూ వచ్చిన రోజుల్లో మహమ్మారిని ఎదుర్కొంటూనే ప్రజలు ఎవరి పనులు వారు చూసుకునేవారని అన్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)