భారత్ లో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు... ఒక్కరోజులో... 

భారత్ లో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు... ఒక్కరోజులో... 

ఇండియాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది.  రోజు 9 వేలకు పైగా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే.  అయితే, గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి.   గడిచిన  24 గంటల్లో 10,964 కేసులు నమోదయ్యాయి.  దీంతో   ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,535 కి చేరింది.  ఇక ఒక్కరోజులో 396  మంది కరోనా వలన మరణించారు. దీంతో మరణాల సంఖ్య 8,498కి చేరింది.  దేశంలో  యాక్టివ్ కేసులు 1,41,842 ఉంటె, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య  1,47,194 గా ఉండటం విశేషం.  యాక్టివ్ కేసుల కంటే డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం కాస్త ఊరటనిచ్చే విషయంగా చెప్పాలి.